Home > కెరీర్ > నిరుద్యోగులకు శుభవార్త.. 1896 పోస్టులకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త.. 1896 పోస్టులకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త.. 1896 పోస్టులకు నోటిఫికేషన్
X

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న 1,896 యానిమల్‌ హజ్బెండరీ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్‌ 20 నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. డిసెంబర్‌ 27న హాల్‌టికెట్లు విడుదల చేసి, అదే నెల 31వ తేదీన కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. గోపాలమిత్ర, గోపాలమిత్ర సూపర్వైజర్ పనిచేసిన వారికి వెయిటేజీ ఉంటుంది. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి జనవరిలో ఉద్యోగాల్లో నియమిస్తారు. ఎంపికైన అభ్యర్థులు వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో పనిచేయాల్సి ఉంటుంది. జీతం నెలకు రూ.22,460 నుంచి రూ.72,810 మధ్య ఉంటుంది.

యానిమల్ హజ్బెండరీ , డెయిరీయింగ్, పౌల్ట్రీ సెన్సెస్, వెటర్నరీ సైన్స్ తదితర డిసిప్లిన్‌లలో పాలిటెక్నిక్, ఇంటర్మీడియట్ ఒకేషనల్, బీఎస్సీ, ఎంఎస్సీ, డిప్లొమా, బీటెక్ వంటివి పాసై ఉండాలి. అభ్యర్థుల వయసు 01.07.2023 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీలకు ఐదేళ్లు, పీహెచ్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఇస్తారు. అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, మాజీ సైనికులకు రూ.500.

ఉమ్మడి జిల్లాల వారీగా ఖాళీలు

అనంతపురం 473

చిత్తూరు 100

కర్నూలు 252

వైఎస్ఆర్ కడప 210

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 143

ప్రకాశం 177

గుంటూరు 29

కృష్ణా 120

పశ్చిమ గోదావరి 102

తూర్పు గోదావరి 15

విశాఖపట్నం 28

విజయనగరం 13

శ్రీకాకుళం 34


Updated : 21 Nov 2023 2:32 PM IST
Tags:    
Next Story
Share it
Top