Home > కెరీర్ > ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్-2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్-2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వం కీలక నిర్ణయం.. గ్రూప్-2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
X

నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. రాష్ట్రంలో 212 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ విషయాన్ని ఏపీపీఎస్సీ సభ్యులు పరిగె సుధీర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. గతకొంత కాలంగా పోస్టుల సంఖ్య పెంచాలని నిరుద్యోగులు సీఎంను అభ్యర్థిస్తున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్.. పోస్టుల సంఖ్య పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. కాగా, గత ఆగస్టులో 508 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. త్వరలో మొత్తం 720 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.




Updated : 20 Oct 2023 6:36 PM IST
Tags:    
Next Story
Share it
Top