Home > కెరీర్ > TS DSC 2023: B.tech-B.Ed అభ్యర్థులు డీఎస్సీకి అప్లై చేయొచ్చు

TS DSC 2023: B.tech-B.Ed అభ్యర్థులు డీఎస్సీకి అప్లై చేయొచ్చు

TS DSC 2023: B.tech-B.Ed అభ్యర్థులు డీఎస్సీకి అప్లై చేయొచ్చు
X

తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ (TS DSC 2023) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జిల్లా స్థాయి ఎంపిక కమిటీ(DSC)ల ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు మునిసిపల్ స్కూళ్లలో ఖాళీలను కూడా ఈ డీఎస్సీ (TS DSC 2023) ద్వారా భర్తీ చేస్తారు. డీఎస్సీలో భర్తీ చేసే ఉద్యోగాల్లో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ ఉపాధ్యాయులు, లాంగ్వేజ్‌ పండిట్స్‌, పీఈటీ ఉద్యోగాలున్నాయి. తెలంగాణ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ https://schooledu.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ డీఎస్సీకి సంబంధించి సెప్టెంబర్ 20 వ తేదీ నుంచి ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అక్టోబర్‌ ౨౧ దరఖాస్తులకు చివరితేది.





అయితే బీఈడీ పూర్తి చేసిన బీటెక్‌ విద్యార్థులు కూడా డీఎస్సీ నోటిఫికేషన్‌కు అప్లై చేసుకోవచ్చని తాజాగా విద్యాశాఖ తెలిపింది. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. బీటెక్‌ విద్యార్థులకు 2015 సంవత్సరం నుంచే బీఈడీలో చేరేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అప్పటి నుంచి ప్రతి ఏటా వందల మంది బీటెక్‌ విద్యార్థులు బీఈడీ కోర్సులో ప్రవేశం పొందుతున్నారు. వారికి 2017లో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) రాసే అవకాశం ఇచ్చారు. అప్పటి నుంచి ఉపాధ్యాయ నియామకాలు జరగలేదు. తాజా నోటిఫికేషన్‌ తో స్కూల్‌ అసిస్టెంట్‌ మ్యాథ్స్, ఫిజిక్స్ పోస్టులకు వారు పోటీపడొచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. డీఎస్సీకి అప్లై చేసుకునేందుకు వారికి ఒకట్రెండు రోజుల్లో అవకాశం ఇవ్వనున్నారు.




Updated : 12 Oct 2023 8:08 AM IST
Tags:    
Next Story
Share it
Top