ఇంటర్ అర్హతతో 1,207 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా
X
ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ క్వాలిఫికేషన్ తో 1207 ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. కేంద్ర సంస్థలోని పలు విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. స్టెనో గ్రాఫర్ పోస్టుల భర్తీకి అప్లై చేసుకోవాలని సూచించింది. స్టెనోగ్రాఫర్ సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్ ), స్టెనో గ్రాఫర్ డి (గ్రూప్ సి) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా నోటిఫికేషన్ చివరి తేదీ ఆగస్టు 23తో ముగుస్తుంది.
మొత్తం పోస్టులు: మొత్తం1207 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా.. అందులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి 93, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి 1114 పోస్టులు ఉన్నాయి.
అర్హత: అప్లికేషన్ చేసే వ్యక్తి కచ్చితంగా ఇంటర్ పాసై ఉండాలి
ఏజ్ లిమిట్: స్టెనోగ్రాఫర్ సి పోస్టులకు 2023 ఆగస్టు 1 నాటికి 18-33 ఏళ్లు ఉండాలి. స్టెనోగ్రాఫర్ డి పోస్టులకు 18-27 ఏళ్లు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: రూ.100 ((మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు)
ఎడిట్ ఆప్షన్: దరఖాస్తులో ఏవైనా పొరపాట్లుంటే ఆగస్టు 24, 25 తేదీల్లో మార్చుకోవచ్చు.
పరీక్షా విధానం: అక్టోబర్ లో నిర్వహించే ఈ పరీక్ష.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. పూర్త వివరాలు https://ssc.nic.in చూసుకోవచ్చు.