CRPF Recruitment : స్పోర్ట్స్ కోటాలో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. మీరు అప్లై చేశారా..
X
కేంద్ర హోంశాఖ పరిధిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ ‘సి’ విభాగంలోని కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్-గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ 169 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు, సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. సరైన అర్హతలున్నవారు ఫిభ్రవరి 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. పురుష, మహిళా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ విధులు నిర్విర్తించే అవకాశం పొందవచ్చు.
మొత్తం పోస్టులు : 169 (మేల్- 83, ఫిమేల్- 86)
కానిస్టేబుల్ పోస్టులు (జనరల్ డ్యూటీ)
క్రీడా విభాగాలు: జిమ్నాస్టిక్, జూడో, వుషు, షూటింగ్, బాక్సింగ్, అథ్లెటిక్స్, ఆర్చరీ, రెజ్లింగ్ ఫ్రీ స్టైల్, గ్రీకో రోమన్, తైక్వాండో, వాటర్ స్పోర్ట్స్ కయాక్, కానో, రోయింగ్, బాడీబిల్డింగ్, వెయిట్‌లిఫ్టింగ్, స్విమ్మింగ్, ట్రయత్లాన్, డైవింగ్, డైవింగ్ ఈక్వెస్ట్రియన్, యాచింగ్, ఐస్ హాకీ, ఐస్ స్కేటింగ్, ఐస్ స్కీయింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు, నిర్దిష్ట శారీరక దారుడ్యం, సంబంధిత క్రీడాంశాల్లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 15/02/2024 నాటికి 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ఠ వయసులో జనరల్ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 10 ఏళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు 8 ఏళ్లు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: సంబంధిత క్రీడాంశంలో ప్రతిభ, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీత భత్యాలు: రూ.21,700-రూ.69,100 ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100(ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2024
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://crpf.gov.in/