Home > కెరీర్ > 38 వేల పోస్టులకు కేంద్రం నోటిఫికేషన్.. టీచింగ్/నాన్ టీచింగ్

38 వేల పోస్టులకు కేంద్రం నోటిఫికేషన్.. టీచింగ్/నాన్ టీచింగ్

38 వేల పోస్టులకు కేంద్రం నోటిఫికేషన్.. టీచింగ్/నాన్ టీచింగ్
X

కేంద్రం ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏకలవ్య ఆదర్శ పాఠశాల్లో ఉద్యోగాల భర్తీకి భారీ స్థాయిలో నోటిఫికేషన్ విడుదలైంది. బోధన, బోధనేతర కేటగిరిల్లో 38 వేల ఉద్యోగాలను ప్రత్యక్ష నియామక విధానంలో భర్తీ చేయనున్నారు. 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థుల కోసం ఈ నియామకాలు చేపడుతున్నారు. ప్రిన్సిపల్‌ పోస్టు నుంచి ప్లంబర్ పోస్టు వరకు ఎన్నో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. నేషనల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ (NESTS) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 740 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నది కేంద్రం లక్ష్యం.

ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టును బట్టి విద్యార్హత పదో తరగతి నుంచి పీజీ వరకు ఉంటుంది. అభ్యర్థులకు ఇంగ్లిష్, హిందీ, ప్రాంతీయ భాషల్లో నైపుణ్యం ఉండాలి. వయసు 30 నుంచి 50 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ నిబంధనలమేరకు సడలింపు ఉంటుంది. పోస్టులను బట్టి జీతం రూ. 18,000ల నుంచి రూ.2,09,200 వరకు ఉంటుంది. పరీక్ష తేదీలు, ఇతర వివరాలు తర్వాత వెల్లడిస్తారు.

పోస్టుల వివరాలు

ప్రిన్సిపల్‌ 740, వైస్‌ ప్రిన్సిపల్‌ 740.

పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ) 8880, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ) 8840.

ఆర్ట్‌ టీచర్‌ 740, మ్యూజిక్‌ టీచర్‌, 740 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌(పీఈటీ) 1480.

లైబ్రేరియన్‌ 740, కౌన్సెలర్‌ 740 స్టాఫ్‌ నర్సు 740.

హాస్టల్‌ వార్డెన్‌ 1480, అకౌంటెంట్‌ 740, సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ 740, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ 1480, క్యాటరింగ్ అసిస్టెంట్‌ 740.

డ్రైవర్‌ 740, ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌ 740, ల్యాబ్‌ అటెండెంట్‌ 740, గార్డెనర్‌ 740, కుక్‌ 470, మెస్‌ హెల్పర్‌ 1480, చౌకీదార్‌ 1480, స్వీపర్‌ 2220.

Updated : 5 Jun 2023 8:45 PM IST
Tags:    
Next Story
Share it
Top