సప్లిమెంటరీ పరీక్షలో ఫెయిల్.. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
X
నేటి సమాజంలో ఆత్మహత్య ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు. విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడడం కలకలం రేపుతోంది. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయనే కారణంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎంత అవగాహన పర్చిన వారిలో మార్పు రావడం లేదు. అనూహ్య నిర్ణయాలతో కన్నవారికి తీరని శోకం మిగిల్చి వెళ్లిపోతున్నారు. ఫలితాలు వచ్చిన సమయంలో ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు పునారావృతమవుతున్నాయి.
ఏపీలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా విడుదలైన ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లొ ఫెయిలయ్యాననే కారణంతో పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడికి చెందిన రవి శంకర్ సూసైడ్ చేసుకున్నాడు. రాజమండ్రి కొవ్వురు వంతెనపై నుంచి గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుమారుడు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.