గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆ ఎగ్జామ్ డేట్ మార్పు
X
ఏపీలోని గ్రూప్ 2 అభ్యర్థులకు ఎస్బీఐ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెల 25 నిర్వహించే ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ను మార్చుకోవచ్చని తెలిపింది. ఆ రోజు గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేవారు క్లర్క్ ఎగ్జామ్ను మార్చి 4కు మార్చుకోవాలని సూచించింది. ఈ అవకాశం ఈ నెల 23న ఉదయం 9గంటల వరకే ఉంటుందని స్పష్టం చేసింది. అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మార్పు చేసుకోవాలని సూచించింది.
కాగా ఏపీలో ఈ నెల 25న గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. అయితే అదే రోజు ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ ఉండడంతో రెండు పరీక్షలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఏ పరీక్ష రాయాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఈ అంశంపై స్పందించిన ఏపీపీఎస్సీ.. రెండు ఎగ్జామ్స్కు దరఖాస్తు చేసుకున్న వారు తమకు హాల్ టికెట్స్ పంపించాలని తెలిపింది. ఎస్బీఐ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పింది. ఈ మేరకు ఎస్బీఐతో ఏపీపీఎస్సీ సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించింది.
ఎస్బీఐ ఎగ్జామ్ నోటిఫికేషన్ నవంబర్లో రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత నెల రోజులకు డిసెంబర్ లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మిగాతా ఎగ్జామ్స్ లేని టైంలో ఏపీపీఎస్పీ ఎగ్జామ్స్ నిర్వహిస్తుంది. కానీ ఈ సారి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ రోజే ప్రిలిమ్స్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై అభ్యర్థులు మండిపడడ్డారు. గ్రూప్ 2 ఎగ్జామ్ను వాయిదా వేయాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ సహా పలువురు డిమాండ్ చేశారు. రెండు పరీక్షలు ఒకేరోజు నిర్వహిస్తే విద్యార్థులు నష్టపోతారని చెప్పారు. దీంతో సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగిన ఏపీపీఎస్సీ అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా చూసింది.