Home > కెరీర్ > నిరుద్యోగులకు శుభవార్త..రైల్వేలో 2400 ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త..రైల్వేలో 2400 ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త..రైల్వేలో 2400 ఉద్యోగాలు
X

రైల్వే డిపార్ట్‎మెంట్ నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. పదో తరగతి, ఐటీఐ అర్హతతో రైల్వే లో ఉద్యగాలు పొందే అవకాశం కల్పిస్తోంది. తాజాగా అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కోసం జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. rrccr.com వెబ్ సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.

ఆగష్టు నెల 28 నుంచి జాబ్ నోటిఫికేషన్‎కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. మొత్తం 2409 పోస్టులకు భర్తీ చేయనున్నారు అధికారులు. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులుగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయో పరిమితిలో సడలింపు ఇవ్వనుంది.

కనీసం 50 శాతం మార్కులతో పది ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగానికి అర్హత కలిగి ఉంటారు. ట్రేడ్‌లో ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 100 రూపాయల దరఖాస్తు ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆఫ్ అప్రెంటిస్ 2023-24 ద్వారా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. పేరు, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్ వంటి వివరాలను నమోదు చేయడం ద్వారా కూడా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఎంపికైన వారికి రూ.7000 చొప్పున స్టైఫండ్ కూడా ఇవ్వనుంది రైల్వే శాఖ.



Updated : 31 Aug 2023 11:49 AM IST
Tags:    
Next Story
Share it
Top