Home > కెరీర్ > వీఆర్ఏల సర్దుబాటు.. 14,954 పోస్టులు క్రియేట్ చేసిన ప్రభుత్వం

వీఆర్ఏల సర్దుబాటు.. 14,954 పోస్టులు క్రియేట్ చేసిన ప్రభుత్వం

వీఆర్ఏల సర్దుబాటు.. 14,954 పోస్టులు క్రియేట్ చేసిన ప్రభుత్వం
X

రాష్ట్రంలో వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా వివిధ శాఖల్లో 14,954 పోస్టులు మంజూరు చేసింది. రెవెన్యూ శాఖలో 2,451 జూనియర్ అసిస్టెంట్‌, 2,113 రికార్డ్‌ అసిస్టెంట్‌, 679 సబార్డినేట్‌ పోస్టులు మంజూరు చేసింది. మిషన్‌ భగీరథ శాఖలో 3,3,72 హెల్పర్‌ పోస్టులు, నీటిపారుదల శాఖలో 5,063 లష్కర్‌, హెల్పర్‌ పోస్టులు, పురపాలక శాఖలో 1,266 వార్డు ఆఫీసర్‌ పోస్టులను కొత్తగా సృష్టించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వీఆర్‌ఏల విద్యార్హతల మేరకు వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేయాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. వారి సేవలను వినియోగించుకోవాలని సూచించింది. వీఆర్‌ఏల సర్దుబాటుపై మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయగా వీఆర్‌ఏలతో చర్చించి వారి అభిప్రాయాలు తీసుకుంది. అనంతరం ఉపసంఘం సూచనల ప్రకారం వీఆర్‌ఏలను సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పోస్టులు మంజూరు చేసింది.


Updated : 4 Aug 2023 1:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top