Group-2 : TSPSC గ్రూప్-2, 3 పరీక్షల తేదీల ప్రకటన
X
తెలంగాణలో నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-2,3 నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. గ్రూప్-2 ఆగస్టు 7,8 తేదీల్లో గ్రూప్-3 నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ జున్9న, మెయిన్స్ ఆక్టోబర్ 21 నుంచి ఉంటాయని వెల్లడించింది. గ్రూప్-1లో 563, గ్రూస్-2లో 783 గ్రూప్-3 1388 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతున్నా, ఒక్కసారి కూడా గ్రూప్-1 పోస్టులు భర్తీ కాలేదు.
గత నోటిఫికేషన్ రద్దు చేసి, మొత్తం 563 పోస్టుల భర్తీకీ TSPSC ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హత ఉన్నవారు గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గత నోటిఫికేషన్ సమయంలో దరఖాస్తు చేసుకున్నవారు తాజా నోటిఫికేషన్ కు ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరంలేదు. సరైన అర్హతలున్న అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గరిష్ఠవయోపరిమితి 44 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు పెంచారు.