Gurukula Posts : గురుకుల అభ్యర్థులకు అలర్ట్.. 60 రోజుల్లోగా విధుల్లో చేరాలి.. లేదంటే?
X
గురుకుల సొసైటీల అధికారులు.. కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు అలర్ట్ జారీ చేశారు. గురుకుల నియామకాలకు ఎంపికైన అభ్యర్థులు.. పోస్టింగ్ ఆర్డర్లు తీసుకున్న 60 రోజుల్లోగా విధుల్లో చేరాలని గురుకుల సొసైటీలు సూచించాయి. గడువులోగా విధుల్లో చేరకపోతే.. వారి నియామకాలు రద్దవుతాయని తెలిపాయి. దీంతో పాటు అభ్యర్థులు మూడేళ్ల కాలపరిమితికి రూ. లక్ష పూజీకత్తులో బాండు సమర్పించాలని సొసైటీలు అభ్యర్థులను ఆదేశించాయి. అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలు, ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ ను సంబంధిత స్కూల్ ప్రిన్సిపల్ కు సమర్పించాలని తెలిపాయి. ఇదిలా ఉండగా.. గురుకుల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో గోల్ మాల్ జరిగినట్లు తెలుస్తుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని, జోనల్ పోస్టులను మల్టీజోనల్ గా నింపినట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్ కు విరుద్ధంగా అనర్హులను ఎంపిక చేసినట్లు అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు.