Home > కెరీర్ > గ్రూప్స్ 4 పరీక్ష రాద్దామని పరీక్ష హాలుకు పోయింది...తీరా

గ్రూప్స్ 4 పరీక్ష రాద్దామని పరీక్ష హాలుకు పోయింది...తీరా

ఎన్నో ఆశలతో గ్రూప్స్ 4 పరీక్ష కోసం ఎదురుచూసిన విద్యార్థినికి నిరాశే మిగిలింది. ఎగ్జామ్ సెంటర్‎కు వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. హాల్ టికెట్ మార్గమధ్యంలోనే మిస్ అయిందని తెలియగానే సెంటర్ దగ్గరే బోరున విలపించింది. హనుమకొండలోని మిలీనియం స్కూల్ ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఈ సంఘటన జరిగింది. ఎంత ఏడ్చినా సమయం దాటిపోవడంతో పోలీసులు ఆమెను లోపలికి అనుమతించలేదు. ఓ పక్క హాల్ టికెట్ లేకపోవడం , మరోపక్క పది నిమిషాలు ఆలస్యంగా సెంటర్‎కు రావడంతో ఆమె గ్రూప్ 4 పరీక్ష రాయలేకపోయింది.


Updated : 1 July 2023 2:01 PM IST
Tags:    
Next Story
Share it
Top