Home > కెరీర్ > దేశంలోని టాప్ విద్యా సంస్థల్లో HCU.. ఎన్నో ర్యాంక్ అంటే..

దేశంలోని టాప్ విద్యా సంస్థల్లో HCU.. ఎన్నో ర్యాంక్ అంటే..

దేశంలోని టాప్ విద్యా సంస్థల్లో HCU.. ఎన్నో ర్యాంక్ అంటే..
X

కేంద్ర ప్రభుత్వం విద్యా సంస్థల ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. 2022 సంవత్సరానికి గాను తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు మంచి ర్యాంక్ సాధించాయి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (HCU) అత్యుత్తమంగా 10 ర్యాంక్ దక్కింది. ఎన్ఐటీ- వరంగల్ ఓవరాల్ ర్యాంకింగ్ లో 45 స్థానం దక్కించుకోగా.. ఉస్మానియా యూనివర్సిటీ 46వ స్థానం లభించింది. యూనివర్సిటీల విభాగంలో ఓయూకు 22వ స్థానం దక్కగా.. ఆంధ్యా యూనివర్సిటీకి 36వ స్థానం దక్కింది.

ఓవరాల్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ-మద్రాస్ అగ్ర స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో.. ఐఐఎస్సీ-బెంగళూరు, ఐఐటీ-బాంబే, ఐఐటీ-ఢిల్లీలు వరుసగా 2,3,4 స్థానాల్లో నిలిచాయి. 10వ స్థానంలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీల ర్యాంకింగ్‌లో టాప్ ర్యాంక్ లో ఐఐఎస్సీ-బెంగళూరు నిలవగా.. రెండో స్థానంలో జేఎన్యూ-న్యూఢిల్లీ, మూడోస్థానంలో జామియా మిలియా యూనివర్సిటీ-న్యూఢిల్లీ నిలిచాయి.

ఇంజినీరింగ్ విభాగంలో.. ఐఐటీ- మద్రాస్, 10వ స్థానంలో ఐఐటీ- హైదరాబాద్ ఉన్నాయి. మేనేజ్మెంట్ విభాగంలో టాప్ ర్యాంక్ లో ఐఐఎం-అహ్మదాబాద్, రెండో స్థానంలో ఐఐఎం-బెంగళూరు నిలిచాయి. ఇదిలా ఉండగా ఫార్మసీ విభాగంలో.. అగ్ర స్థానంలో జామియా హమ్‌దర్ద్ (న్యూఢిల్లీ), రెండోస్థానంలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (హైదరాబాద్) ఉన్నాయి. ఆర్కిటెక్చర్ విభాగంలో.. అగ్ర స్థానంలో ఐఐటీ-రూర్కీ, 7వ స్థానంలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (విజయవాడ) నిలిచాయి.

లా విభాగంలో.. టాప్ ర్యాంక్ లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ- బెంగళూరు, 4వ ర్యాంక్ లో నల్సార్ యూనివర్సిటీ-హైదరాబాద్ నిలిచాయి. డెంటల్ విభాగంలో.. సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్-చెన్నై, రెండో స్థానంలో.. మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్-మణిపాల్ ఉన్నాయి. వైద్య విద్య విభాగంలో.. అగ్రస్థానంలో ఎయిమ్స్-న్యూఢిల్లీ, రెండోస్థానంలో పీజీఐఎంఈఆర్ (PGIMER)-చండీగఢ్, 3వ స్థానంలో క్రిస్టియన్ మెడికల్ కాలేజీ-వెళ్లూర్ నిలిచాయి.

Updated : 5 Jun 2023 12:08 PM GMT
Tags:    
Next Story
Share it
Top