Home > కెరీర్ > 8 వేల బ్యాంకు పోస్టులకు నోటిఫికేషన్..

8 వేల బ్యాంకు పోస్టులకు నోటిఫికేషన్..

8 వేల బ్యాంకు పోస్టులకు నోటిఫికేషన్..
X

తంబ్.. గ్రామీణ బ్యాంకుల్లో క్లర్కులు, పీఓ, ఆఫీస్ అసిస్టెంట్స్...

దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆర్ఆర్‌బీల్లో 8 వేల పోస్టులకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌’ దీన్ని విడుదల చేసింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-7 ద్వారా వీటిని భర్తీ చేస్తారు. గ్రూప్‌ ఎ- ఆఫీస‌ర్ స్కేల్‌-1, 2, 3, గ్రూప్‌ బి- ఆఫీస్ అసిస్టెంట్ మ‌ల్టీ ప‌ర్పస్‌ కింద పోస్టులను విడగొట్టారు. డిగ్రీ, ఎంబీ, సీఏ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్లో నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు తేదీలు, ఇతర వివరాలు..

జూన్‌ 1న నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆఖరు తేదీ జూన్‌ 21.

రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, దరఖాస్తు సవరణ.. జూన్ 1 నుంచి జూన్ 21 వరకు

ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌ కాల్‌ లెటర్ల డౌన్‌లోడ్‌.. జూలై 10

ప్రీఎగ్జామ్‌ ట్రెయినింగ్‌.. జూలై 17 నుంచి జూలై 22 వరకు

ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ పరీక్ష.. ఆగస్టు నెలలో

ప్రిలిమ్స్‌ ఫలితాలు.. సెప్టెంబర్‌ నెలలో

మెయిన్స్‌ ఆన్‌లైన్‌ పరీక్ష.. సెప్టెంబర్‌

మెయిల్స్‌ ఫలితాల వెల్లడి.. అక్టోబర్‌

ఇంటర్వ్యూ.. అక్టోబర్‌, నవంబర్‌

నియామకాలు.. జనవరి, 2024


Updated : 1 Jun 2023 3:43 PM IST
Tags:    
Next Story
Share it
Top