పోస్టాఫీస్‌లో 12,828 ఉద్యోగాలు..ధరఖాస్తుకు ఇంకా ఐదు రోజులే..
X
పదోతరగతి అర్హతతో పోస్టల్ డిపార్ట్‌మెంట్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. దేశ వ్యాప్తంగా 12,828 జీడీఎస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. వీటిలో ఏపీలో 118, తెలంగాణలో 96 చొప్పున పోస్టులు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు జూన్ 11లోగా https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌విమెన్‌లు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి. దరఖాస్తు చేసేటప్పుడు పాస్‌పోర్ట్ సైజు ఫోటు, మీ సంతకంతో కూడిన పేపర్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
అర్హతలు
* పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి
* మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి
* కంప్యూటర్ పరిజ్ఞానం
* సైకిల్ తొక్కడం రావాలి
వయో పరిమితి
అభ్యర్థులు జూన్ 11, 2023 నాటికి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంది.
ఎంపిక విధానం
పదో తరగతిలో సాధించిన మార్కులతో మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఎంపిపైన అభ్యర్థులకు ఎస్సెమ్మెస్ పంపుతారు. మెసేజ్ వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్(ఏబీపీఎం) హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
జీతం
బీపీఎం పోస్టులకు నెలకు వేతనం రూ.12,000 - రూ.29,380; ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 - రూ.24,470 చొప్పున చెల్లిస్తారు. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు ఎంపికైనవారికి పోస్టాఫీస్ ఉన్న గ్రామంలో నివసిస్తే వసతి సౌకర్యం కలదు.