Home > కెరీర్ > Jee Main 2024 : జేఈఈ మెయిన్ సెషన్ -1 ప్రాథమిక కీ విడుదల

Jee Main 2024 : జేఈఈ మెయిన్ సెషన్ -1 ప్రాథమిక కీ విడుదల

Jee Main 2024 : జేఈఈ మెయిన్ సెషన్ -1 ప్రాథమిక కీ విడుదల
X

జేఈఈ మెయిన్ తొలి విడత ఎగ్జామ్స్ ప్రాథమిక కీ విడుదలైంది. జేఈఈ తొలి విడత పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరిగాయి. దీనికి సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్లనూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 8వరకు తెలిపాలని ఎన్టీఏ సూచించింది. అయితే అభ్యంతరాలపై ప్రతి ప్రశ్నకు రూ.200 ఫీజుగా నిర్ణయించింది.

ఒకవేళ అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు కరెక్ట్ అయితే ఆన్సర్‌ కీని సవరించి తుది కీ విడుదల చేస్తారు. ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్స్ను విడుదల చేస్తారు. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన మూడు వారాల్లోపు ఫలితాలు వెల్లడిస్తామని ఇప్పటికే ఎన్టీఏ ప్రకటించింది. ఇక తొలి విడత జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్కు 12,25,529మంది హాజరయ్యారు. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 15వరకు నిర్వహించనున్నారు. కాగా ఈ సారి సిలబస్లో మార్పులు చేశారు. మ్యాథ్స్లో 5 శాతం, ఫిజిక్స్లో 5 శాతం, కెమిస్ట్రీలో 20శాతం తగ్గించారు. దీంతో విద్యార్థులకు కొంత భారం తగ్గనుంది. దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తారు.


Updated : 7 Feb 2024 11:05 AM IST
Tags:    
Next Story
Share it
Top