జేఈఈ మెయిన్స్ ఇంటిమేషన్ స్లిప్స్ రిలీజ్.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
X
జేఈఈ మెయిన్ ఎగ్జామ్కు ఇంకా వారం రోజులే ఉంది. ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. జేఈఈ మెయిన్స్ 2024 సెషన్-1 పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రిలీజ్ చేసింది. అధికార వెబ్ సైట్లో ఈ స్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు https://jeemain.nta.ac.in/ నుంచి ఈ స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.
ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే..?
అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్సైట్ https://jeemain.nta.ac.in ఓపెన్ చేయాలి. అందులో డౌన్లోడ్ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి అప్లికేషన్ నెంబర్తో పాటు పుట్టిన తేదీని ఎంటర్ చేసి సిటీ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ స్లిపుల్లో ఎగ్జామ్కు సంబంధించి అన్నీ వివరాలు ఉంటాయి. ఎగ్జామ్ సెంటర్స్, పరీక్ష తేదీ, టైమింగ్, రిపోర్టింగ్ టైం, ఎగ్జామ్ రోజు పాటించాల్సిన గైడ్లైన్స్ వంటివి ఉంటాయి. జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు త్వరలోనే విడుదల కానున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వరకు జరగనుండగా.. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి 15వరకు నిర్వహిస్తున్నారు. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన మూడు వారాల్లోపు ఫలితాలు వెల్లడిస్తామని ఎన్టీఏ ప్రకటించింది. కాగా ఈ సారి సిలబస్లో మార్పులు చేశారు. మ్యాథ్స్లో 5 శాతం, ఫిజిక్స్లో 5 శాతం, కెమిస్ట్రీలో 20శాతం తగ్గించారు. దీంతో విద్యార్థులకు కొంత భారం తగ్గనుంది.