Home > కెరీర్ > స్టేట్ ఫైనాన్సియ‌ల్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.35వేల జీతం

స్టేట్ ఫైనాన్సియ‌ల్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.35వేల జీతం

స్టేట్ ఫైనాన్సియ‌ల్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.35వేల జీతం
X

ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ పలు పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన.. ఫైనాన్షియల్, టెక్నికల్, లీగల్ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ల కోసం అభ్యర్థులను రిక్రూట్ చేస్తుంది. ఈ నోటిపికేషన్ ద్వారా 20 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ లు భర్తీ కానున్నాయి. అయితే, ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవాళ్ల వయో పరిమితి 21 నుంచి 30 సంవత్సరాలకు నిర్ణయించింది.

అంతేకాకుండా.. అప్లై చేసుకునేవాళ్లకు సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఆన్ లైన్ టెస్ట్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లై చేసుకునేవాళ్లకు ఇంగ్లిష్, తెలుగు.. చదవడం, రాయడం వచ్చి ఉండాలి. ఇందులో క్వాలిఫై అయితే నెలకు రూ.35వేల జీతం పొందుతారు. ఈ అర్హతలు కలిగి అభ్యర్థులు APSFC వెబ్ సైట్ (https://esfc.ap.gov.in/) అప్లై చేసుకోవాలి. దరకాస్తుకు చివరి తేదీ జూన్ 30.

Updated : 5 Jun 2023 8:58 PM IST
Tags:    
Next Story
Share it
Top