Home > కెరీర్ > పది పాసైతే.. ఎయిర్పోర్ట్లో ఉద్యోగం

పది పాసైతే.. ఎయిర్పోర్ట్లో ఉద్యోగం

పది పాసైతే.. ఎయిర్పోర్ట్లో ఉద్యోగం
X

పదో తరగతి ఉత్తీర్ణులైన వాళ్లకు ఎయిర్ పోర్ట్ లో పనిచేసే అవకాశం వచ్చింది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే నైపుణ్యం అవసరంలేని కేటగిరిలో ఈ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. వివిధ కేటగిరీల్లో 998 ఉద్యోగాలకు ఏఐ ఎయిర్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఆన్ లైన్ అప్లికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 18లోగా అప్లై చేసుకోవాలని కోరింది.

నోటిఫికేషన్ వివరాలు:

*మొత్తం పోస్ట్ లు 998 కాగా.. వీటిలో 971 హ్యాండీ మ్యాన్ పోస్ట్ లు, 20 యుటిలిటీ ఏజెంట్ (పురుషులు), మహిళలకు 7చొప్పున కేటాయించారు.

*ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మూడేళ్లపాటు కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఎంపిక చేస్తారు. తర్వాత పనితీరు ఆధారంగా, అవసరాన్ని బట్టి రెన్యూవల్ చేసుకునే అవకాశం కల్పిస్తారు.

*ఈ ఉద్యోగాలకు వయో పరిమితి.. జనరల్ కు 28, ఓబీసీకి 31, ఎస్సీ/ఎస్టీలకు 33 ఏళ్లుగా విధించారు.

*ఇంగ్లీష్ చదవడం, అర్థం చేసుకోవడం రావాలి. హిందీ మాట్లాడగలగాలి. నెలకు రూ.21,330 చొప్పుర జీతం చెల్లిస్తారు.

* ఫిజికల్ ఎండ్యురెన్స్ టెస్ట్ (వెయిట్ లిఫ్టింగ్‌, రన్నింగ్‌ వంటివి), పర్సనల్‌/ వర్చువల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

Updated : 4 Sept 2023 6:43 PM IST
Tags:    
Next Story
Share it
Top