Home > కెరీర్ > Group-1 posts : గ్రూప్-1కు లైన్ క్లియర్..సుప్రీంలో పిటిషన్ వెనక్కి తీసుకున్న టీఎస్పీఎస్సీ

Group-1 posts : గ్రూప్-1కు లైన్ క్లియర్..సుప్రీంలో పిటిషన్ వెనక్కి తీసుకున్న టీఎస్పీఎస్సీ

Group-1 posts : గ్రూప్-1కు లైన్ క్లియర్..సుప్రీంలో పిటిషన్ వెనక్కి తీసుకున్న టీఎస్పీఎస్సీ
X

తెలంగాణలో గ్రూప్-1 పోస్టుల భర్తీపై ఉన్న సందిగ్థతకు తెరపడింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీఎస్పీఎస్సీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో పాటు పాత కమిషన్ స్థానంలో కొత్త టీఎస్పీఎస్సీ ఏర్పాటు అయ్యింది. సుప్రీం కోర్టులో వేసిన గ్రూప్ 1 పిటిషన్ వెనక్కి తీసుకుంది. దీంతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చేందుకు బోర్డు సిద్ధమవుతోంది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి వాటి భర్తీకి ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే 60 కొత్త పోస్తులను కలిపి మొత్తం 563 పోస్టులకు సప్లిమెంటరీ లేదా కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు కొత్త పోస్టులకు మాత్రమే అర్హులుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అటు ఉద్యోగ నియమాకాలు, ఫలితాల వెల్లడిలో టీఎస్పీఎస్సీ దూకుడు పెంచింది. ఇప్పటికే నిర్వహించిన పరీక్షల ఫలితాలను వరుసగా వెల్లడించాలని అధికారులు నిర్ణయించారు. ఏడాదిలో 2 లక్షలు ఉద్యోగాలను భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా ముందుగానే నిర్వహించిన ఫలితాలను వెల్లడించి త్వరతగతిన భర్తీలు చేపట్టేందుకు టీఎస్పీఎస్సీ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం గ్రూప్4 ఫలితాలను వెల్లడించింది. త్వరలోనే జిల్లాల వారిగా మెరిట్ లిస్ట్ తో భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇతర భర్తీలపై కూడా బోర్డు దృష్టి పెట్టనుంది.

Updated : 12 Feb 2024 3:14 AM GMT
Tags:    
Next Story
Share it
Top