Home > కెరీర్ > ఎంబీబీఎస్ అడ్మిషన్ల షెడ్యూలు విడుదల.. 4 విడతల కౌన్సెలింగ్

ఎంబీబీఎస్ అడ్మిషన్ల షెడ్యూలు విడుదల.. 4 విడతల కౌన్సెలింగ్

ఎంబీబీఎస్ అడ్మిషన్ల షెడ్యూలు విడుదల.. 4 విడతల కౌన్సెలింగ్
X

దేశవ్యాప్తంగా వైద్యవిద్యా కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి గాను ఆలిండియా కోటా సీట్ల భర్తీకి షెడ్యూలు వెలవడింది. జాతీయ వైద్య కమిషన్‌ సారథ్యంలోని కౌన్సెలింగ్ కమిటీ ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్ల షెడ్యూలును విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 20 నుంచి మొదలవుతుంది. వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లను ఆలిండియా కోటా కింద భర్తీ చేస్తారు. కౌన్సెలింగ్‌ నాలుగు విడతలు ఉంటుంది. తొలి విడత జులై 27, 28 తేదీల్లో, రెండో విడత ఆగస్ట్ 16, 17, మూడో విడత సెప్టెంబర్ 6, 7న నిర్వహిస్తారు. మిగిలిన సీట్లను చివరి విడతలో భర్తీ చేస్తారు.

జులై 20 నుంచి 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తొలి విడత ఫలితాలను 29న విడుదల చేస్తారు. రెండో విడత రిజిస్ట్రేషన్ ఆగస్టు 9 నుంచి ఆగస్టు 14 మధ్య చేసుకోవాలి. ఫలితాలను ఆగస్టు 18న ప్రకటిస్తారు. మూడో విడత రిజిస్ట్రేషన్‌ను ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 4 లోపు చేసుకోవాలి. సెప్టెంబరు 8న ఫలితాలు వెల్లడవుతాయి. చివరి విడత రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు ఉంటుంది. ఫలితాలను ఆ నెల 26న ప్రకటిస్తారు.

Updated : 17 July 2023 9:30 AM IST
Tags:    
Next Story
Share it
Top