Mega DSC Notification : నేడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్?
X
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది. గత డీఎస్సీ నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే రేపు లేదా ఎల్లుండి కొత్త నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ రిలీజ్ చేశారు. వీటికి సంబంధించిన గడువు, రూల్స్ ను త్వరలో వెల్లడించనున్నారు. మే లేదా జూన్ లో ఆన్‌లైన్ పద్ధతిలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
గత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం..సమగ్రంగా కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో తెలిపింది. అయితే పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని..కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని విద్యాశాఖ చెప్పింది. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.