MIDHANI Recruitment 2023 Notification : నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్ మిధానిలో జాబ్స్
X
హైదరాబాద్‌లోని మిధాని సంస్థలో(మిశ్రధాథు నిగమ్ లిమిటెడ్) ఉద్యోగాల భర్తీకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ట్రేడ్స్ విభాగాల్లో 54 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీ నవంబర్ 1. ఉద్యోగాన్ని బట్టి వివిధ విద్యార్హతలను నిర్ణయించారు. పదవ తరగతి చదివి సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ లేదా డిప్లమా చేసి ఉండాలి. రాత పరీక్ష, ప్రాక్టికల్ పరీక్షల ద్వారా అభ్యర్థును ఎంపిక చేస్తారు. జూనియర్ ఆపరేటర్ ట్రైనీ పోస్టుల అభ్యర్థుల వయసు 30 ఏళ్ల లోపు, సీనియర్ ఆపరేటర్ ట్రైనీల అభ్యర్థల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. సీనియర్ ఆపరేటర్ ట్రైనీలకు జీతం రూ. 21,900, జూనియర్ ఆపరేటివ్ ట్రైనీలకు రూ. 20 వేలు చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు https://midhani-india.in/ వెబ్ సైట్‌ను సంప్రదించాలి.
ఖాళీల వివరాలు
సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ- మెటలర్జీ: 20
సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ- మెకానికల్: 10
జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ- ఫిట్టర్: 13
జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ- వెల్డర్: 2
జూనియర్ ఆపరేటివ్ ట్రైనీ- ఎలక్ట్రీషియన్: 6
సీనియర్ ఆపరేటివ్ ట్రైనీ- ఎలక్ట్రికల్: 3