Home > కెరీర్ > NEET UG 2024 దరఖాస్తులు మొదలయ్యాయ్.. అప్లై చేసుకోండిలా

NEET UG 2024 దరఖాస్తులు మొదలయ్యాయ్.. అప్లై చేసుకోండిలా

NEET UG 2024 దరఖాస్తులు మొదలయ్యాయ్.. అప్లై చేసుకోండిలా
X

NEET UG 2024 (నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షకు.. దరఖాస్తులకు ఆహ్వానిస్తుంది. ఈ పరీక్షను మే 5వ తేదీన నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే ప్రకటించగా.. శుక్రవారం (ఫిబ్రవరి 9) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 9 నుంచి మార్చి 9 రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు.. మొత్తం 13 భాషల్లో లిఖితపూర్వకంగా ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం.. ప్రతి సంవత్సరం NTA ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ లింక్ ద్వారా https://neet.nta.nic.in/ అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు:

జనరల్ కేటగిరి- రూ.1700

జనరల్ ఈడబ్య్లూఎస్/ ఓబీసీ, ఎన్సీఎల్- రూ.1600

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జండర్- రూ.1000

పరీక్ష తేదీ:

మే5న మధ్యాహ్నం 2 నుంచి 5:20 గంటల వరకు.

హాల్ టికెట్ డౌన్ లోడ్:

అడ్మిట్ కార్డుల డౌన్ లోడ్, పరీక్ష కేంద్రాలకు సంబంధించిన వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

Updated : 9 Feb 2024 9:18 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top