Home > కెరీర్ > Govt Job: 6వేల పోస్ట్లు.. రేపటి నుంచి దరఖాస్తు ఆహ్వానం

Govt Job: 6వేల పోస్ట్లు.. రేపటి నుంచి దరఖాస్తు ఆహ్వానం

Govt Job: 6వేల పోస్ట్లు.. రేపటి నుంచి దరఖాస్తు ఆహ్వానం
X

బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నవాళ్లకు గుడ్ న్యూస్. డిగ్రీ పూర్తయితే చాలు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వం రంగ బ్యాంక్ ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో ఉద్యోగం పొందొచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం 6,160 పోస్ట్ లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో వివరాలివే..

మొత్తం ఖాళీలు 6160 ఉన్నాయి. వాటిని కేటగిరీల వారీగా ఎస్సీకి- 989, ఎస్టీకి- 514, ఓబీసీకి- 1389, ఈడబ్ల్యూఎస్‌ కు- 603, యూఆర్‌ కు- 2,665 చొప్పున కేటాయించారు. ఈ ఉద్యోగాల్లో ఏపీలో 390 ఖాళీలు ఉండగా.. తెలంగాణలో 125 ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నుంచి డిగ్రీ సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.

జాబ్ వచ్చిన మొదటి ఏడాది.. నెలకు రూ.15 వేల చొప్పున స్టైఫండ్‌ ఇస్తారు. అయితే, ఇతర అలవెన్సులకు మాత్రం అర్హులు కాదు.

ఏజ్ లిమిట్: 2023 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 28 ఏళ్లు మధ్య ఉండాలి.

పరీక్ష విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామ్, స్థానిక భాష పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా జాబ్ కు ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్ టైప్: ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఉంటుంది. ఇది అక్టోబర్‌/నవంబర్‌లో జరిగే అవకాశం ఉంది.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు.




Updated : 31 Aug 2023 5:20 PM GMT
Tags:    
Next Story
Share it
Top