Home > కెరీర్ > రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
X

రైల్వే రిక్రూట్​మెంట్​ సెల్​ (ఆర్​ఆర్​సీ) సదరన్​ రైల్వేలో 790 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్​ లోకో పైలట్​, టెక్నీషియన్​, జేఈ, ట్రైన్ మేనేజర్​ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి అర్హతలను నిర్ణయించారు. పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

మొత్తం ఖాళీలు: 790

అసిస్టెంట్​ లోకో పైలట్​/ టెక్నీషియన్​ - 595

జూనియర్​ ఇంజినీర్​ - 168

ట్రైన్​ మేనేజర్​ - 27

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్‌, ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

వయోపరిమితి: అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి 42 సంవత్సరాలు. అయితే ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: అభ్యర్థులకు జనరల్​ డిపార్ట్​మెంట్​ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్​ నిర్వహిస్తారు. అభ్యర్థులకు మొదటిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు.. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్​ చేస్తారు. తరువాత మెడికల్ ఎగ్జామినేషన్​ నిర్వహించి, అందులో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 30.08.2023


Updated : 9 Aug 2023 5:45 PM IST
Tags:    
Next Story
Share it
Top