NTPC Jobs: బీటెక్ పాసయ్యారా.. భారీ జీతంతో ఎన్టీపీసీలో ఉద్యోగులు
X
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్.. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 495 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రకటించింది. ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
పోస్ట్ల వివరాలు: మొత్తం 495 ట్రైనీ పోస్ట్ లను విభాగాలుగా పరిశీలిస్తే.. ఎలక్ట్రికల్ పోస్టులు 120, మెకానికల్ పోస్టులు 200, ఎలక్ట్రానిక్స్/ఇన్ స్ట్రుమెంటేషన్ పోస్టులు 80, సివిల్ కు 30, మైనింగ్ పోస్టులు 65 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
ఏజ్ లిమిట్: అభ్యర్థుల వయస్సు ఆన్ లైన్ అప్లై చేసుకునే చివరి తేదీ నాటికి 27 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హత: బీటెక్ లో 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం మార్కులు వస్తే చాలు. దీంతో పాటు తప్పనిసరిగా గేట్ 2023 పరీక్ష రాసి ఉండాలి.
అభ్యర్థుల ఎంపిక: గేట్ 2023లో సాధించిన మార్కులు, ఇతర సర్టిఫికేట్లను పరిశీలించి, వైద్య పరీక్షలు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం: ఉద్యోగం పొందిన వారికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000ల వరకు ఉంటుంది. అంతేకాకుండా ఇతర సదుపాయాలు కూడా ఉంటాయి. జాబ్ వచ్చినవారు వేర్వేరు చోట్ల ఏడాది పాటు ట్రైనింగ్ పొందాల్సి ఉంటుంది. ట్రైనింగ్ పూర్తైన తర్వాత పోస్టింగ్ ఇస్తారు. దేశంలో ఎక్కడైనా పనిచేయొచ్చు.