మీరు డిగ్రీ పాస్ అయ్యారా ? నెలకు లక్షలు సంపాదించే ఈ గవర్నమెంట్ జాబ్ మీకోసమే
X
ప్రభుత్వ అటానమస్ బాడీ క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (QCI) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎగ్జామినర్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్ (గ్రూప్ A) పోస్టులకు(మొత్తం 553 ఖాళీలకు) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు QCI అధికారిక వెబ్‌సైట్ qcin.orgలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇందుకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 14న ప్రారంభమై ఆగస్టు 4న ముగుస్తుంది. రిక్రూట్‌మెంట్ పరీక్షను సెప్టెంబర్ 3న నిర్వహించాల్సి ఉంది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ నవంబర్ 17, 2023 నాటికి ముగియనుంది.
ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 3న జరుగుతుంది. మెయిన్ ఎగ్జామ్ అక్టోబర్ 1న నిర్వహిస్తారు. ఆ ఖాళీలు పరిశీలిస్తే..
బయో-టెక్నాలజీలో 50,
బయో-కెమిస్ట్రీలో 20,
ఫుడ్ టెక్నాలజీలో 15,
కెమిస్ట్రీలో 56,
పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 9,
బయో-మెడికల్ ఇంజనీరింగ్‌లో 53,
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్‌లో 108,
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 29,
కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 63,
ఫిజిక్స్‌లో 30,
సివిల్ ఇంజనీరింగ్‌లో 9,
మెకానికల్ ఇంజనీరింగ్‌లో 99,
మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో 4,
టెక్స్‌టైల్ ఇంజనీరింగ్‌లో 8 ఖాళీలు ఉన్నాయి.
అర్హత ప్రమాణాలు
అభ్యర్థులకు తప్పనిసరిగా కనీసం 21 ఏళ్లు నిండి ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించే చివరి తేదీ నాటికి 35 ఏళ్లు మించకూడదు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచిలర్, మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జనరల్, OBC వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.1,000 ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. SC, ST, PwD/ దివ్యాంగులు (PH), అలాగే అన్ని వర్గాల మహిళలు రూ.500 రూపాయలు చెల్లించాలి.
సెలక్షన్ ప్రాసెస్
ఈ ప్రాసెస్ లో అభ్యర్థులు మూడు ఫేజ్‌ల్లో నిర్వహించే టెస్టులు క్లియర్ చేయాల్సి ఉంటుంది. వాటిలో ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ఉంటాయి. అభ్యర్థులు ముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 30% మార్కులు సాధిస్తేనే ఈ ఎగ్జామ్ క్లియర్ చేయగలుగుతారు. OBC/EWS కేటగిరీ అభ్యర్థులు 25%, అన్ని ఇతర వర్గాల అభ్యర్థులు కనీసం 20% స్కోర్ చేయాలి. ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను ఇంగ్లీష్‌లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్ ఎగ్జామ్ రాసేందుకు అర్హత పొందుతారు. మెయిన్ ఎగ్జామ్ కూడా ఇంగ్లీషులోనే నిర్వహిస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూకు 100 మార్కుల వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూలో ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలలో కవర్ అయిన అంశాలపై అభ్యర్థులను ప్రశ్నిస్తారు.
జీతం
QCI రిక్రూట్‌మెంట్ 2023కి ఎంపికైన అభ్యర్థులు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు జీతం పొందుతారు. అధికారిక ప్రకటనలో పేర్కొన్నట్లుగా, నియామకం సమయంలో వాస్తవ అవసరాన్ని బట్టి పేర్కొన్న ఖాళీల సంఖ్య మారవచ్చు.