Home > కెరీర్ > రైల్వేలో 1104 ఉద్యోగాలు.. డిగ్రీ, రాతపరీక్ష అక్కర్లేకుండానే..

రైల్వేలో 1104 ఉద్యోగాలు.. డిగ్రీ, రాతపరీక్ష అక్కర్లేకుండానే..

రైల్వేలో 1104 ఉద్యోగాలు.. డిగ్రీ, రాతపరీక్ష అక్కర్లేకుండానే..
X

ఏటా వేలకొద్దీ ఉద్యోగాలను భర్తీ చేసే భారతీయ రైల్వే నెలకు ఐదారు జాబ్ నోటిఫికేషన్లు వదులుతుంటుంది. డిగ్రీ పూర్తిచేయని వారికి కూడా వేలాది ఉద్యోగాలు ఇచ్చే సంస్థల్లో రైల్వేది అగ్రస్థానం. తాజాగా రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్... ఈశాన్య రైల్వే (ఎన్‌ఈఆర్‌) పలు అప్రెంటిస్‌షిప్ పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1104 అప్రెంటిస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిగ్రీ అర్హత లేకుండా, రాతపరీక్ష నిర్వహించకుండా కేవలం మార్కుల ఆధారంగా నియమాకాలు జరపనున్నారు. అభ్యర్థులు 50 శాతం మార్కులతో 10వ తరగతి, ఐటీఐ చేసి ఉండాలి. ఆగస్ట్ 2 లోగా ఆన్ లైన్లో అప్లై చేసుకోవాలి. వయసు 2. 8. 2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. 10, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

ఖాళీలు

గోరఖ్‌పూర్.. మెకానికల్ వర్క్‌షాప్ – 411, సిగ్నల్ వర్క్‌షాప్ – 63, బ్రిడ్జ్ వర్క్‌షాప్ – 35

ఇజ్జత్ నగర్.. మెకానికల్ వర్క్‌షాప్ – 151, డీజిల్ షెడ్ – 60, క్యారేజ్ అండ్‌ వ్యాగన్ – 64

లక్నో జంక్షన్.. క్యారేజ్ అండ్‌ వ్యాగన్ - 155

గోండా.. డీజీల్ షెడ్ మెకానిక్స్ - 90

వారణాసి.. క్యారేజ్ అండ్‌ వ్యాగన్ - 75

Updated : 18 July 2023 9:51 AM IST
Tags:    
Next Story
Share it
Top