Home > కెరీర్ > RPF Recruitment Notification : ఆర్పీఎఫ్ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

RPF Recruitment Notification : ఆర్పీఎఫ్ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

RPF Recruitment Notification : ఆర్పీఎఫ్ ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
X

రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్లో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు అర్హతలు, రిక్రూట్ మెంట్ ప్రాసెస్ గురించి అధికారిక వెబ్ సైట్ rpf.indianrailways.gov.inలో చూడొచ్చని చెప్పింది.

పోస్టుల సంఖ్య

తాజా రిక్రూట్ మెంట్ లో రైల్వే శాఖ 2వేల మంది కానిస్టేబుళ్లు, 250 మంది సబ్ ఇన్ స్పెక్టర్ ఖాళీలు భర్తీ చేయనుంది. మొత్తం ఖాళీలలో 10శాతతం ఎక్స్ సర్వీస్ మెన్, 15శాతం మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేశారు.

రిక్రూట్మెంట్ విధానం

ఆర్పీఎఫ్ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి మూడు దశల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

ఫేజ్ 1 : సీబీటీ.. రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తుంది.

ఫేజ్ 2 : సీబీటీలో పాసైన అభ్యర్థులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నిర్వహించే ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఫేజ్ 3 :డాక్యుమెంట్ వెరిఫికేషన్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్టిఫికెట్లను పరిశీలిస్తుంది.

అభ్యర్థుల వయసు

సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 20 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి.

కానిస్టేబుల్ అభ్యర్థుల వయసు 18 నుంచి 25గా నిర్ణయించారు.

రిజర్వేషన్ కేటగిరి అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు

సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

కానిస్టేబుల్ అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి లేదా దాని తత్సమాన అర్హత పరీక్ష పాసై ఉండాలి.

ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎస్సై అప్లికేషన్లను rpf.indianrailways.gov.in వెబ్ సైట్లో ఆన్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు తేదీలను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు త్వరలోనే ప్రకటించనుంది.




Updated : 3 Jan 2024 1:24 PM IST
Tags:    
Next Story
Share it
Top