SBI Apprentice Recruitment: ఎస్బీఐలో 6వేలకుపైగా పోస్టులు.. ఇలా అప్లై చేయండి
X
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ భారీ సంఖ్యలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 6,160 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిలో ఏపీలో 390 ఖాళీలు ఉండగా, తెలంగాణలో 125 ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు.
ఖాళీల వివరాలు:
ఎస్సీ - 989 పోస్టులు
ఎస్టీ - 514 పోస్టులు
ఓబీసీ - 1389 పోస్టులు
ఈడబ్ల్యూఎస్ - 603 పోస్టులు
యూఆర్ - 2665 పోస్టులు
విద్యార్హతలు:
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 1 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ఆయా కేటగిరీల వారికి ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.300 చెల్లించాలి.ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ట్రైనింగ్ పీరియడ్:
ఎస్‌బీఐ అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది.
స్టైఫండ్:
అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు రూ.15,000 చొప్పున స్టైఫండ్ అందిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్:
అభ్యర్థులకు ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థుల.. ధ్రువపత్రాలను పరిశీలన చేస్తారు. తరువాత వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2023 సెప్టెంబర్ 1
దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2023 సెప్టెంబర్ 21
ఆన్‌లైన్ పరీక్షలు జరిగే తేదీలు : 2023 అక్టోబర్/ నవంబర్లో జరిగే అవకాశం ఉంది.