గుడ్ న్యూస్... SBIలో 2000 వేల పోస్టులకు నోటిఫికేస్
X
దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడదల చేసింది. జీతం నెలకు రూ. 36,000-63,840 మధ్య ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏ డిసిప్లిన్‌లోనైనా డిగ్రీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఆఖరు తేది ఈ నెల 27.
అభ్యర్థుల వయసు 2024 ఏప్రిల్1 నాటినికి 21 నుంచి 30 ఏళ్లలోపు ఉండాలి. ఎస్టీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓసీ(ఎన్సీఎల్.. lనాన్ క్రీమీలేయర్) మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, వికలాంగ దివ్యాంగులకు పదమూడేళ్లు, వికలాంగ ఎస్సీ, ఎస్టీలకు పదిహేనేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు రూ. 750. మిగతా కేటగిరీలకు ఫీజు నుంచి మినహాయింపు. ప్రిలిమినరీ, మెయిన్స్, సైకోమెట్రిక్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ/ గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.