Home > కెరీర్ > టీసీఎస్ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు షాకిచ్చిన ఐటీ దిగ్గజం

టీసీఎస్ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు షాకిచ్చిన ఐటీ దిగ్గజం

టీసీఎస్ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు షాకిచ్చిన ఐటీ దిగ్గజం
X

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలు చేస్తున్న హైబ్రిడ్‌ వర్కింగ్ పాలసీకి గుడ్‌బై చెప్పింది. అక్టోబర్‌ 1 నుంచి టీసీఎస్ ఎంప్లాయిస్ అంతా ఆఫీసులకు రావాల్సిందేనని ఆదేశించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం. టీసీఎస్ నిర్ణయాన్ని ఇతర ఐటీ కంపెనీలు సైతం ఫాలో అయ్యే అవకాశముంది. దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్‌లో దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

2020లో కొవిడ్ 19 మహమ్మారి మొదలైన సమయంలో కంపెనీలన్నీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశమిచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు హైబ్రిడ్ వర్క్ మోడ్ మొదలైంది. ఈ విధానంలో కంపెనీని బట్టి ఉద్యోగులు వారంలో ఒకటి నుంచి 3 రోజులు ఆఫీసుకు వెళ్లడం మిగతా రోజులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. టీసీఎస్ ఉద్యోగులు ప్రస్తుతం వారంలో 3 రోజులు మాత్రమే ఆఫీసులు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆ వర్క్ కల్చర్కు గుడ్ బై చెప్పిన సంస్థ అక్టోబర్ 1 నుంచి 5 రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని స్పష్టం చేసింది.

టీసీఎస్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో సగం మంది ఉద్యోగులు 2020 మార్చి తర్వాత జాబ్ లో జాయిన్ అయ్యారు. వీరంతా సీనియర్లు, లీమ్‌ లీడర్ల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుందని, వారి నడవడిక, ఆలోచనా తీరు నుంచి కొత్త వారు తెలుసుకోవాల్సింది చాలా ఉంటుందని కంపెనీ వార్షిక నివేదికలో స్పష్టం చేసింది. ఉద్యోగులు మధ్య చర్చ జరగకుండా అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే ఈ ఏడాదిలోనే విడతలవారీగా ఉద్యోగులను ఆఫీసులకు రప్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే టీసీఎస్‌ తాజా నిర్ణయం తీసుకుంది.


Updated : 29 Sept 2023 9:40 PM IST
Tags:    
Next Story
Share it
Top