రేపు టీచర్ల ట్రాన్స్ఫర్ షెడ్యూల్ రిలీజ్
X
హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం టీచర్ల బదిలీలకు రంగం సిద్ధం చేసింది. సెప్టెంబర్ 2 నుంచి ట్రాన్స్ఫర్లు చేపట్టనుంది. సెప్టెంబర్ 1న బదిలీలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయనున్నారు. టీచర్ల ట్రాన్స్ఫర్లకు హైకోర్టు బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించి బదిలీలు నిర్వహించనున్నారు. తుది తీర్పునకు లోబడి ఉపాధ్యాయుల బదిలీలు జరగాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
నిజానికి టీచర్ల బదిలీల షెడ్యూల్ ను విద్యాశాఖ జనవరిలోనే విడుదల చేసింది. ఫిబ్రవరిలో ఆ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించింది. దాదాపు 59వేల మంది టీచర్లు ట్రాన్స్ఫర్ల కోసం అప్లై చేసుకున్నారు. అయితే కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ట్రాన్స్ఫర్లపై స్టే విధించింది. తాజాగా స్టే ఎత్తివేయడంతో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల ప్రక్రియ షురూ కానుంది. గతంలో బదిలీలకు ఫిబ్రవరి 1ని కటాఫ్ తేదీని నిర్ణయించగా.. తాజాగా ఈ గడువును సెప్టెంబర్ 1గా ఖరారుచేసింది. 8ఏండ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉపాధ్యాయులను తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ చేయనున్నారు.