Home > కెరీర్ > వారం రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్..!

వారం రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్..!

వారం రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్..!
X

ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అధికారంలో రాగానే మెగా డీఎస్సీ వేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చేందుకు. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చే పనిలో పడింది. టీచర్ పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. 11వేలకు పైగా పోస్టులతో మెగా డీఎస్సీ నోటీఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన పంపింది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. వారం, పది రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది.

ఎన్నికలకు ముందు గత బీఆర్ఎస్ సర్కార్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6న 5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. దీనికి 1.77 లక్షల మంది అప్లై చేశారు. అయితే నవంబర్లో జరగాల్సిన పరీక్షలను అసెంబ్లీ ఎన్నికల వల్ల వాయిదా వేశారు. రాష్ట్రంలో 1.22 లక్షల టీచర్ పోస్టులకు గాను.. 1.03 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అందుకే మెగా డీఎస్సీని విడుదల చేసి 11 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తుంది.


Updated : 21 Feb 2024 4:27 PM GMT
Tags:    
Next Story
Share it
Top