Home > కెరీర్ > 1520 పోస్టులకు తెలంగాణ ఆరోగ్యశాఖ నోటిఫికేషన్..

1520 పోస్టులకు తెలంగాణ ఆరోగ్యశాఖ నోటిఫికేషన్..

1520 పోస్టులకు తెలంగాణ ఆరోగ్యశాఖ నోటిఫికేషన్..
X

తెలంగాణ ప్రభుత్వం మరో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సారథ్యంలోని మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ 1520 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) ఉద్యోగాల భర్తీకి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జోన్ల వారీగా నియమకాలు చేపడతారు. ‘జోన్ 3 రాజన్న’ లో అత్యధికంగా 263 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులు పాసై ఉండాలి. వయసు 18 నుంచి 44 ఏళ్లలోపు ఉండాలి.

ఆన్‌లైన్‌లో రాతపరీక్ష, అనుభవం బట్టి ఎంపిక ఉంటుంది. 100 మార్కుల పరీక్ష నుంచి 80 శాతం అనుభవానికి 20 శాతం వెయిటేజీ ఇస్తారు. ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యక్రమాల్లో అందించిన సేవలకు వెయిటేజీ ఇస్తారు. అనుభవాన్ని బట్టి, అభ్యర్థుల వేతనం రూ., 31,040 నుంచి రూ. 92,050 వరకు ఉంటుంది. పరీక్ష ఫీజు రూ. 500. హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌లలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఆగస్టు 25, 2023 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి తేదీ సెప్టెంబర్‌ 19, 2023.

జోన్ల వారిగీ ఖాళీల వివరాలు

జోన్‌ 1 కాళేశ్వరం: 169

జోన్‌ 2 బాసర: 225

జోన్‌ 3 రాజన్న: 263

జోన్‌ 4 భద్రాద్రి: 237

జోన్‌ 5 యాదాద్రి: 241

జోన్‌ 6 చార్మినార్‌: 189

జోన్‌ 7 జోగులాంబ: 196

పూర్తి వివరాలకు.. https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm


Updated : 29 July 2023 7:34 PM IST
Tags:    
Next Story
Share it
Top