Home > కెరీర్ > గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
X

గ్రూప్-1 పరీక్షకు లైన్ క్లియర్ అయింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. పేపర్ లీకేజీ దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని.. ఇటీవల పేపర్ లీకైనప్పుడు ఏ సిబ్భంది ఉందో.. మళ్లీ అదే సిబ్బందితో గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహిస్తున్నారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. పరీక్షను రద్దు చేయాలంటూ హైకోర్టులో ఇప్పటివరకు ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇవాళ (మే 5) ఆ పిటిషన్లను కొట్టేసింది.

11 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్షలో పారదర్శకత లేకుంటే అభ్యర్థులు నష్టపోతారని న్యాయవాదులు వాదించారు. మిగతా పేపర్లు లీక్ అయ్యాయని.. ఆ పరీక్షలు ఇంకా నిర్వహించలేదని తెలిపారు. విచారణ పూర్తి కాకుండా ఉన్నపళంగా గ్రూప్ 1 పరీక్షను నిర్వహించొద్దని న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. వీటిపై స్పందించిన కోర్టు.. ‘నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుత కమీషన్లో నిందితులు ఎవరూ లేరు. అలాంటప్పుడు పరీక్షను ఎందుకు నిర్వహించొద్ద’ని ధర్మాసనం ప్రశ్నించింది.

దర్యాప్తుతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదని.. పరీక్ష రాయడానికి అభ్యర్థులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారని తెలిపింది. కాగా జూన్ 11న గ్రూప్-1 పరీక్ష జరగనుంది. దీనికోసం 3.8 లక్షల అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఇప్పటివరకు 1.59 లక్షల మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు.

Updated : 5 Jun 2023 8:23 PM IST
Tags:    
Next Story
Share it
Top