ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు..
X
తెలంగాణ ఇంటర్మడియట్ అడ్మిషన్ల గడువు తేదీని పొడిగించారు. 2023-24 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు జూలై 25 వరకు కొనసాగుతాయని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. షెడ్యూలు ప్రకారం గడువు జూన్ 30వ తేదీతోనే ముగిసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అడ్మిషన్లు ఇంకా పూర్తికాకపోవడంతో గడువును పెంచారు. జూనియర్ కాలేజీల జాబితా తమ వెబ్‌సైట్‌లో ఉందని, పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలో పాసైన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందొచ్చని బోర్డు తెలిపింది.
మరోపక్క.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను త్వరగా విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దోస్త్, ఇంజనీరింగ్, ఇతర ప్రవేశాల నేపథ్యంలో ఫలితాలను త్వరగా విడుదల చేయనున్నారు. జూలై మొదటి వారంలో ఈ పలితాలను విడుదయ్యే అవకాశముంది. సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య జరిగాయి.