Home > కెరీర్ > Telangana Gurukuls : గురుకులాల్లో ప్రవేశాల్లో దరఖాస్తు గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే.?

Telangana Gurukuls : గురుకులాల్లో ప్రవేశాల్లో దరఖాస్తు గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే.?

Telangana Gurukuls : గురుకులాల్లో ప్రవేశాల్లో దరఖాస్తు గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే.?
X

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తు చివరి తేదీని విద్యాశాఖ పొడగించింది. 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు ప్రకటించగా.. ఆ గడువును ఈ నెల 20 వరకు పొడిగించారు. ఈ విషయాన్ని వీటీజీ సెట్‌ కన్వీనర్‌ నవీన్‌ నికోలస్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 11న రాతపరీక్ష నిర్వహించి.. మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. వివరాల కోసం 180042545678 టోల్ ఫ్రీ నంబర్ ను లేదా.. www.tgcet.cgg. gov.in, http://www.tgcet.cgg.gov. inను సంప్రదించాలని సూచించారు.




Updated : 6 Jan 2024 9:14 AM IST
Tags:    
Next Story
Share it
Top