NEET PG 2024 Exam : నీట్ పీజీ పరీక్ష తేదీలో మార్పు.. మార్చిలో కాదు
X
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఓ ప్రకటన విడుదల చేసింది. నీట్ 2024 (NEET 2024) పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ డేట్స్ ను ప్రకటించింది. జులై 7 నుంచి నీట్ పీజీ పరీక్షలు జరగనున్నాయి. పీజీ అర్హత సాధించడానికి కటాఫ్ ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన కౌన్సెలింగ్ జరిగనుంది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే.. మార్చి 3వ తేదీన నీట్ పీజీ పరీక్ష జరగాల్సింది. పోయిన ఏడాది కూడా మార్చి 5వ తేదీనే నీట్ పీజీ పరీక్షలు జరిగాయి. దీనికి అనుగునంగా విద్యార్థులు ఎగ్జామ్స్ కు సన్నద్ధం అవుతున్నారు. కానీ ఈసారి జులై 7వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.
కాగా ఈ ఏడాది నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్ట్) నిర్వహించే అవకాశం లేదని నిర్వహించట్లేదు. పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ (అమెండ్‌మెంట్) రెగ్యులేషన్స్-2018 బదులుగా.. పోజీ మెడికల్ రెగ్యులేషన్స్- 2023ని ఇటీవల ప్రభుత్వం నోటిఫై చేసింది. దీని ప్రకారం పీజీ కోర్సుల ప్రవేశాలు ఉంటాయి. దీనికోసం నెక్స్ట్ విధానం అమల్లోకి వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న నీట్ పీజీ పరీక్షలు కొనసాగుతాయి. పూర్తి వివరాల కోసం nbe.edu.in, natboard.edu.in. ను సంప్రదించండి.