TSGenCo Written Exams : TS జెన్‌కో రాత పరీక్షలు వాయిదా
X
తెలంగాణ జెన్‌కో రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17వ తేదీన ఈ పరీక్షలను నిర్వహించాల్సి ఉండగా.. ప్రభుత్వం ఈ పరీక్షలను వాయిదా వేసింది. అదే తేదీన ఇతర పరీక్షలు ఉన్నందున జెన్ కో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మళ్లీ పరీక్షలను ఎప్పడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. ఎగ్జామ్స్ కు సంబంధించిన అప్డేట్స్ ను సంస్థ వెబ్ సైట్ www.tsgenco.co.inలో పొందుపరుస్తామని వెల్లడించారు. ఇక కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా వాణి కార్యక్రమంలో జెన్ కో పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి వినతులు వచ్చాయి.
17న వేరే పరీక్షలు ఉన్నందున జెన్ కో పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు మంత్రి శ్రీధర్ బాబును కోరారు. ఇక మంత్రి శ్రీధర్ బాబు విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్ జెన్ కో నిర్ణయం తీసుకుంది. కాగా ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సివిల్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ ఖాళీలు, కెమిస్ట్స్ పోస్టులను భర్తీ చేయడానికి టీఎస్ జెన్‌కో ఈ ఏడాది అక్టోబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికోసం వేలాదిమంది అభ్యర్థులు తమ దరఖాస్తులను దాఖలు చేశారు. ఈ పరీక్షల కోసం సన్నద్ధమౌతోన్నారు.