Home > కెరీర్ > Inter Exams : వారం రోజుల్లో ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్.. ప్రతిపాదనలు సిద్ధం..

Inter Exams : వారం రోజుల్లో ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్.. ప్రతిపాదనలు సిద్ధం..

Inter Exams  : వారం రోజుల్లో ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్.. ప్రతిపాదనలు సిద్ధం..
X

తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్ షెడ్యూల్పై ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. వార్షిక పరీక్షల కోసం మొత్తం మూడు షెడ్యూళ్లను బోర్డు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28, మార్చి 1, మార్చి 5 నుంచి పరీక్షలను ప్రారంభించేలా నివేదికను రూపొందించింది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం లభించగానే షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో వారం రోజుల్లో ఎగ్జామ్స్ షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్‌ను ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే ఛాన్స్ ఉంది.

ఏప్రిల్‌ 1 -15 మధ్య జేఈఈ మెయిన్స్ చివర విడత ఎగ్జామ్స్‌ ఉన్నాయి. కాబట్టి ఇంటర్‌ పరీక్షలు ముగిసిన తర్వాత కొంత టైం ఉంటే విద్యార్థులు ప్రిపేర్ అవడానికి వీలవుతుంది. అదేవిధంగగా ఇంటర్‌ తర్వాతే టెన్త్ పరీక్షలు నిర్వహించాలి. ఈ సారి జూన్‌ 1 నుంచే ఇంటర్‌ కాలేజీలు ప్రారంభంకావడంతో గతేడాది కంటే ముందే పరీక్షలు ప్రారంభించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఫస్టియర్‌లో 4.5 లక్షలు, సెకండియర్‌లో 4.8 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. గతేడాది మార్చి 15 నుంచి ఇంటర్మీడియట్‌ ఎగ్జామ్స్ జరిగాయి.


Updated : 24 Dec 2023 9:31 AM IST
Tags:    
Next Story
Share it
Top