TS Polycet :నోటిఫికేషన్ విడుదల.. పరీక్ష తేదీ ఎప్పుడంటే?
Bharath | 15 Feb 2024 7:39 PM IST
X
X
తెలంగాణ విద్యాశాఖ టీఎస్ పాలిసెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పదోతరగతి లేదా దానికి సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు.. ప్రస్తుతం ఎస్ఎస్ఎసీ పరీక్షలు రాయనున్న విద్యార్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి మొదలవనుంది. ఇతర వివరాల కోసం.. https://polycet.sbtet.telangana.gov.in/ అధికారిక వెబ్ సైట్ లో లాగిన్ కావాలి.
అప్లికేషన్ చివరి తేదీ: ఏప్రిల్ 22 వరకు
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీలు రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాలి.
పరీక్ష తేదీ: మే 17వ తేదీన
ఫలితాలు: పరీక్ష నిర్వహించిన 12 రోజుల తర్వాత వెలువడుతాయి.
Updated : 15 Feb 2024 7:39 PM IST
Tags: ts polycet 2024 notification ts polycet 2024 notification released ts polycet ts polycet 2024 polycet 2024 notification ts polycet notification polyce notification released ts polycet notification 2024 ts polycet notification released 2024 ts polycet 2024 dates released polycet ts polycet 2024 application polycet notification
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire