Home > కెరీర్ > TSPSC : గ్రూప్‌-4 ఫైనల్ కీ విడుదల

TSPSC : గ్రూప్‌-4 ఫైనల్ కీ విడుదల

TSPSC : గ్రూప్‌-4 ఫైనల్ కీ విడుదల
X

టీఎస్పీఎస్సీ గ్రూప్‌-4 ఫైనల్ కీ విడుదలైంది. పేపర్‌ 1లో ఏడు ప్రశ్నలు తొలగించిన అధికారులు.. 8 ప్రశ్నలకు ఆప్షన్‌ మార్చారు. అదేవిధంగా పేపర్‌ 2లో రెండు ప్రశ్నలు తొలగించి.. ఐదు ప్రశ్నలకు ఆప్షన్‌ మార్పు చేశారు. ఈ మేరకు ఫైనల్ కీ ని టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆగస్టు 28న గ్రూప్‌ - 4 ప్రైమరీ కీ విడుదల చేసిన అధికారులు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 4 వరకు అభ్యంతరాలను స్వీకరించారు.

ఈ అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత ఇవాళ తుది కీ విడుదల చేశారు. జులై 1న గ్రూప్ - 4 ఎగ్జామ్ జరిగింది. 8,180 పోస్టులకు 9.51 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 7,62,872 మంది పరీక్ష రాశారు. ఇక తుది ఫలితాలను అక్టోబర్‌ రెండో వారంలో విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జూన్ 11న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్‎ను హైకోర్టు రద్దు చేసింది. పరీక్షల సమయంలో బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని సరిగా అమలు చేయకపోటవంపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం పరీక్ష రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై టీఎస్పీఎస్సీ అప్పీల్కు వెళ్లగా.. డివిజన్ సైతం సింగ్ బెంజ్ తీర్పును సమర్ధించింది.


Updated : 6 Oct 2023 9:39 PM IST
Tags:    
Next Story
Share it
Top