గ్రూప్-1 ప్రిలిమ్స్ కీ విడుదల.. చెక్ చేసుకోండిలా..!
X
గతేడాది డిసెంబర్ లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన క్రమంలో.. టీఎస్పీఎస్సీ తిరిగి ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ ఇవాళ (జూన్ 28) విడుదల చేసింది. జూన్ 11న రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ కు 2.32 లక్షల మంది హాజరు కాగా.. ఆ పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను, మాస్టర్ క్వశ్చన్ పేపర్ ను కూడా టీఎస్పీఎస్సీ వెబ్ సైట్ లో పెట్టింది.
ప్రాథమిక ప్రిలిమినరీ కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ సాయంత్రం వరకు స్వీకరిస్తామని టీఎస్పీఎస్సీ పేర్కొంది. అయితే, అభ్యంతరాలను కేవలం ఇంగ్లిష్ లోనే స్వీకరించనున్నారు. అభ్యంతరాలు తీరిన తర్వాత జులై మొదటి వారంలోనే మెయిన్ లిస్ట్ ను విడుదల చేసే అవకాశం ఉంది. కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. https://notificationslist.tspsc.gov.in/ka1773ba1860