Home > కెరీర్ > JL Hall Ticket 2023 Download :జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్లు విడుదల

JL Hall Ticket 2023 Download :జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్లు విడుదల

JL Hall Ticket 2023 Download :జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్లు విడుదల
X

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల నియామక పరీక్షకు సంబంధించి టీఎస్పీఎస్సీ హాల్ టికెట్లు విడుదల చేసింది. 1329 పోస్టులకు ఈ నెల 12 నుంచి అక్టోబర్ 3 వరకు ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అభ్యర్థులు https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో లాగినై హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీఎస్పీఎస్సీ అధికారులు చెప్పారు.

జేఎల్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ మెథడ్లో నిర్వహించనున్నారు. 16 సబ్జెక్టులకు సంబంధించి 11 రోజుల పాటు పరీక్ష జరగనుంది. ఉదయం జనరల్ స్టడీస్, మధ్యాహ్నం అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్ట్ పేపర్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. 1329 పోస్టుల్లో మల్టీజోన్‌-1లో 724, మల్టీజోన్‌-2లో 668 పోస్టులు ఉన్నాయి.

సబ్జెక్టులవారీగా పరీక్ష తేదీలు ఇవే..

ఎగ్జామ్ డేట్ సబ్జెక్ట్

సెప్టెంబర్ 12 ఇంగ్లిష్‌

సెప్టెంబర్ 13 ఎకనామిక్స్, బోటనీ

సెప్టెంబర్ 14 మ్యాథమెటిక్స్

సెప్టెంబర్ 20 కెమిస్ట్రీ

సెప్టెంబర్ 21 తెలుగు

సెప్టెంబర్ 22 ఫిజిక్స్, జువాలజీ

సెప్టెంబర్ 25 కామర్స్

సెప్టెంబర్ 26 సివిక్స్, అరబిక్, ఫ్రెంచ్

సెప్టెంబర్ 27 హిందీ

సెప్టెంబర్ 29 హిస్టరీ, సంస్కృతం

అక్టోబర్‌ 03 ఉర్దూ

Updated : 7 Sep 2023 2:53 PM GMT
Tags:    
Next Story
Share it
Top