Home > కెరీర్ > UPSC సివిల్స్ నోటిఫికేషన్ విడుదల

UPSC సివిల్స్ నోటిఫికేషన్ విడుదల

UPSC సివిల్స్ నోటిఫికేషన్ విడుదల
X

ఆల్ ఇండియా సర్వీసుల్లో 1,056 ఉద్యోగాల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్(CSC)కు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి మార్చి 5 వరుకు ఆన్‌లైన్‌లో దరాఖాస్తులను స్వీకరించనుంది. ప్రిలిమినరీ పరీక్ష మే 26న మెయిన్స్ సెప్టెంబర్ 20న జరగనుంది. కాగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో 150 పోస్టులకు విడిగా మరో నోటికేషన్ రిలీజ్ అయింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌లో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిగ్రీ చివరి యేడాది చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు దారుల వయోపరిమితి 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే 32 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షలు, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఓబీసి, ఇతర అభ్యర్థులకు రూ.100 మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంది. నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత పోస్టుల సంఖ్య, కేటగిరీల వారీగా వయోపరిమితి, సిలబస్‌, పరీక్ష తేదీలు వంటి ఇతర ముఖ్యమైన వివరాలు వివరణాత్మకంగా తెలుసుకోవచ్చు. యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ సెప్టెంబర్ 20వ తేదీ నుంచి వరుసగా ఐదు రోజులు నిర్వహించే అవకాశం ఉంది. కాగా ప్రతీయేట వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా ఈ కింది సర్వీసుల్లో ఖాళీలను భర్తీ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష్ కేంద్రాలు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం, హైదరాబాద్‌, వరంగల్‌ నగరల్లో యూపీఎస్సీ ప్రకటించింది.



Updated : 14 Feb 2024 4:24 PM IST
Tags:    
Next Story
Share it
Top