Home > కెరీర్ > ఎడ్యుకేషన్ లోన్.. ఈ పోర్టల్తో వెరీ ఈజీ.. ఒకే దరఖాస్తుతో మూడు బ్యాంకులకు..

ఎడ్యుకేషన్ లోన్.. ఈ పోర్టల్తో వెరీ ఈజీ.. ఒకే దరఖాస్తుతో మూడు బ్యాంకులకు..

ఎడ్యుకేషన్ లోన్.. ఈ పోర్టల్తో వెరీ ఈజీ.. ఒకే దరఖాస్తుతో మూడు బ్యాంకులకు..
X

ఉన్నత విద్యను చదవాలనుకునేవారికి కేంద్రం ప్రవేశపెట్టిన విద్యాలక్ష్మీ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. చదవాలని ఆసక్తి ఉన్నా ఆర్థిక స్థోమత లేనివారికి బ్యాంకు రుణాలు ఇప్పించడం కోసం కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. విద్యార్థులు తమ ఇంటి నుంచే ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలు.. అవసరమైన రుణం వారి ఇంటి తలుపును తట్టే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు లోన్ల కోసం ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది.

వెబ్సైట్ అప్లై చేసుకున్న తర్వాత ఏ బ్యాంకులో లోన్ ఇస్తారు అనే విషయాన్ని మెస్సేజ్, ఫోన్ ద్వారా తెలియజేస్తారు. రుణం మంజూరు అయ్యే వరకు ప్రతి విషయాన్ని అప్ డేట్ చేస్తారు. ఎటువంటి పూచీకత్తు లేకుండానే ఈ రుణం ఇస్తారు. అగస్ట్ 15, 2015న ఈ పథకాన్ని కేంద్ర ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా విద్యార్థి ఒకసారి దరఖాస్తు చేసుకుంటే.. ఒకేసారి మూడు బ్యాంకులకు, మూడు రకాల విద్యారుణాలకు దరఖాస్తు చేసుకున్నట్లే.

ఇందులో విద్యా రుణాలను మూడు రకాలుగా ఉన్నాయి. మొదటిది 4లక్షల లోపు రుణాలు, రెండోది 4 నుంచి 7.5 లక్షలు, మూడోది 7.5 లక్షలకు పైచిలుకు రుణాలుగా విభజించారు. బ్యాంకులతో పోల్చితే దీంట్లో వడ్డీ రేటు తక్కువగానే ఉంటుంది. విద్యార్థి కుటుంబం ఆదాయం 4.5 లక్షల లోపు ఉన్నవారు ఎటువంటి పూచికత్తు లేకుండా 7.5 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. దరఖాస్తుకు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థతలకు సంబంధించి ధృవపత్రాలు, కొత్తగా విద్యార్థి చదవబోయే కోర్సుకు సంబంధించి అడ్మిషన్ డాక్యుమెంట్స్, ఇన్ కం సర్టిఫికెట్ అవసరమవుతాయి.

ముందుగా https://www.vidyalakshmi.co.in/Students/ ఓపెన్ చేయాలి

తర్వాత విద్యార్థి లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి

ఈ తర్వాత celaf పూర్తి చేయాలి.

celaf అంటే కామన్ ఎడ్యుకేషన్ లోన్ అప్లికేషన్ ఫాం. అంటే అన్ని రకాల విద్యారుణాలకు ఒకే దరఖాస్తు అన్నమాట.

దీన్ని ద్వారా విద్యార్థి ఒకేసారి మూడు విద్యారుణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసిన తర్వాత ఏ రుణాలకు అర్హులు అవుతారో, ఏ బ్యాంక్ రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉందో తెలుసుకోవచ్చు.

అప్లై చేసిన తర్వాత 15 రోజుల్లో విద్యా రుణం వస్తుందా లేదా అనేది తెలిసిపోతుంది.



Updated : 15 Aug 2023 2:27 PM IST
Tags:    
Next Story
Share it
Top