Home > కెరీర్ > సంస్కృత విద్యాపీఠంలో టీచర్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

సంస్కృత విద్యాపీఠంలో టీచర్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

సంస్కృత విద్యాపీఠంలో టీచర్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
X

యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సంస్కృత విద్యాపీఠం పాఠశాలలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అనుబంధంగా పనిచేస్తున్న ఈ పాఠశాలలో మొత్తం మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్లో భాగంగా ఇద్దరు సంస్కృత, ఒక ఇంగ్లీష్ టీచర్ ను నియమించనున్నారు.

అర్హతలు

సంస్కృత టీచర్ - 02

ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు బీఈడీ కోర్సు పూర్తి చేసి ఉండాలి.

ఇంగ్లీష్ టీచర్ - 01

ఇంగ్లీష్ టీచర్ పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీంతో బీఈడీ ఉండాలి.

దరఖాస్తు విధానం

అభ్యర్థులు దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్తో పాటు విద్యార్హత సర్టిఫికేట్లను జత చేయాల్సి ఉంటుంది. వాటిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎస్ఎల్ఎన్ఎస్ దేవస్థానం ఆఫీస్, యాదగిరి గుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ 508115 అడ్రస్కు జూన్ 15 సాయంత్రం 5.30లోపు పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వయో పరిమితి

అభ్యర్థుల వయోపరిమితి 42 ఏళ్లుగా నిర్థారించారు. అభ్యర్థులు తమ దరఖాస్తు ఎన్వలప్పైన ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకుంటున్నారో స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.20వేల జీతం చెల్లిస్తారు.

Updated : 3 Jun 2023 8:30 PM IST
Tags:    
Next Story
Share it
Top